పుట:2015.393685.Umar-Kayyam.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

ఉమర్ ఖయ్యామ్

707

అంత్యదినాన నీనిజమునందు మహౌఘము గ్రాలెనేని నీ
దంతములందు వ్రేళ్లునిచి దాఁగుడుమూఁతల నాడుదోయి ? ని
శ్చింతముగాఁ గటా ! పరమ చెచ్చెర లోకసుఖాలకమ్మి దు
ర్దాంతతఁ దెచ్చికో ; కలవరాల "యుసూపును" నమ్మినట్లగున్.

708

కోకిల ! నీ మనోహర కూజితములు
క్రుంగఁ బంజరబద్ధవై కూలినావు
కాన, నీ సతీసఖులతోఁ గలయనేర
వకట ! నీయాస లెల్లఁ జల్లాఱిపోయె.

709

ఏ నొకనాఁడు నీశ్వరుగ్రహించెడి విద్యనుబట్టి నేర్వఁగాఁ
బూని ప్రధానుఁడైన యొకబోధకుఁ జేరితి ; వానినుండి య
జ్ఞానవినాశకంబులగు సంజ్ఞలయాను లెఱింగినాఁడ నా
కా నిరవద్య శూన్యముల నాతఁడెఱుంగఁగఁ జెప్పె నయ్యొడన్.

710

"రంజాను" న నుపవాసము
లం జచ్చుటకంటెఁ దిని కలంగని మది ని
న్నుం జర్చించుట మంచిది
సంజాత దయాప్రపూర్ణ సంగతమతినిన్.