పుట:2015.393685.Umar-Kayyam.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

179

703

నీయెడ లోకమందు వ్యసనేచ్ఛలఁ గాలిడుధూమ మొక్కటే
రాయిడువెట్టు ; నీవగలఁ గ్రాలుచుఁ బోయిన నెన్ని నాళ్ళకున్
శ్రేయముగాదు ; తన్నివృతి శ్రేయము ; గాన జగంబు మిథ్యగాఁ
జేయుమి ! యట్టి శూన్యమునఁజేరు మదేకద శాంతి ధామమున్.

704

చావక పూర్వమె యేదో
ప్రో వొనరింపుము గడంగి పుణ్యము ; లేదే
నావల శూన్యకరంబులఁ
బోవల దీవెలుతు రుండఁబోలదు సతమున్.

705

పాంచభౌతిక దేహ సత్వమవు నీవు ;
దయ్యమో, దేవరో, జంతువయ్యు మాన
వత్వమున రూపనివృతిని బడసినావు
ఏది కావలె నన్న నీ వౌదువుగద !

706

ఓయి ! త్వదీయమైత్రిని సముజ్జ్వలతన్ బొనరించినాఁడ వ
య్యో ! యిపు డేల శత్రునిగనొంచెద వేమిటిమాట ? ధాత్రిపైఁ
గాయము దాల్చి యీ యవనికానిచయంబుల దూరఁజేసి నా
ప్రాయమ దుఃఖభాజముల పాలొనరించు టదేమికర్జమో.