పుట:2015.393685.Umar-Kayyam.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

ఉమర్ ఖయ్యామ్

699

ఏను నామణి వెలతగ్గి యీయలేను
నీ రుజాశాంతికిఁ జికిత్సయే రసాత్మ
కంబు ; "జంషీదు రాజ్యంబు" కన్నఁ బ్రియము
కలికి ! నీ వేణి యుభయ లోకముల పెట్టు.

700

ఆపిపీలికా బ్రహ్మ పర్యంతమైన
శక్తి నీతేజమునను బ్రజ్వలన మొందు
నీశ్వరునకు నీకునుభేదమేమి లేదు
నిన్నుఁజెందని సద్గుణ మున్న దెందు ?

701

నీవు చరాచరంబయిన సృష్టి నెఱుంగవు ; నీవు శూన్య సం
స్థావసధాన గాలివలె సాకుచునుంటివి ; యాది నంతమం
దీ వను నాస్తికంబు కల ; యేమియు లేనిది ; మధ్యభాగమం
దావిలయంబు శూన్యము లయంబులఁ బుట్టుచుఁ జచ్చు మిథ్యలన్.

702

ఓయి ! శరీరమున్ విడిచి యూహ యెఱుంగనినింగిఁ బ్రాణముల్
పోయిన, వానిలోఁగలుషముల్, పొరపొచ్చెము లేమియుండు ? నీ
పోయినమూల మా నభముపొంతనె యున్నది ? ధాత్రిపైని నీ
కాయము వచ్చి స్థావరముగాఁ జనునన్నది సిగ్గుగాదొకో.