పుట:2015.393685.Umar-Kayyam.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

181

711

చెఱువెండ నందు చేఁపలు
తిరిగి జలం బిందు వచ్చితీఱు ననన్ ; ద
త్పరిణామము విధి పలికెను
గుఱియౌదురు మిత్తికంతకున్ జనకున్నన్.

712

శూన్యజగాన మాయునికి శోభిల దెప్పుడుఁ ; గాన గాయనీ
ధన్యతమోనివృత్తపరిధానము, నాసవపానమత్త సా
మాన్యము జీవితావధిగ మార్చుము లోకము ప్రాఁతక్రొత్తలన్.
దైన్యతఁ జూపుఁగాక మనదారికి నడ్డమురా వవేవియున్.

713

ఇది వసంతాగమంబు సమీక్షితాగ
మంబు శాద్వలయుతభూరజంబు మాఱి
పుష్పముల వెలార్చి ప్రభాత పూతవాత
ములఁ జలించెడు మేఘాలమెలఁగుఁ గనులు.

714

మాకు సుమంబులున్ దొరకుమార్గములేనిచొ ముండ్లెచాలు ; చీ
కాకు వదల్చు తేజ మెదఁగల్గనిచో నరకాగ్ని చాలు ; న
స్తోకతపస్సమాధిజపతోయజముల్ లభియింప వేసి సీ !
మాకు నిషిద్ధజీవనము మౌంజియు జన్నిద మున్న మేలగున్.