పుట:2015.393685.Umar-Kayyam.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

175

687

మధువు నిషేధమైన నది మంచిసుహృద్గణమందు నాసుధా
మధుర రసానుభూతిని బ్రభాతములన్ సుమనోజ్ఞ మాధురీ
మధుకలఁశాలిబోసి నిజమానినులన్ దగఁద్రాగవచ్చుఁ ద
ద్విధివిధిగాని నీచజనవీథులఁ ద్రావుట కూడ దెప్పుడున్.

688

కొందఱు మద్యపానమున గుందుచునుందురు ; కొందఱీశ్వరుం
బొందఁగ రేబగళ్ళును దపోదనులై పడియుందు ; రిట్లు వీ
రందఱు మాయలో మునిఁగి యంతముగానక నిద్రలోపలన్
జిందులు ద్రొక్కువారె ; యలచిన్మయుఁ డీశ్వరుఁ డొక్కఁడేసుమీ.

689

మధుశాలన్ వదరన్ దలంచెడు నపస్మారప్రలాపంబు లా
పృథుయజ్ఞాది తపస్సమాధులభవ ద్విశ్వాసరాహిత్యమౌ
కథకంటెన్ బరమంబు లో యభవ  ! నీకన్నన్ బరం బేది ? నన్
వృథగాఁ గాల్చిన, లేక సాకినఁ ద్వదావిర్భావమే యీశ్వరా.

690

నే నొకశ్వాన మా దివిని నింగిని వీడి యొకింత నిమ్న సో
పానములందు మెట్టుటకు వచ్చితిఁ ; గాని తదీయగుహ్య మే
రేని గ్రహింపరైరి, మఱి యేటికటంచు నిరాసఁ బెంది నే
నానభ మంటి పోవుటనై తలపెట్టితిఁ ద్రోవ గానకే.