పుట:2015.393685.Umar-Kayyam.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

ఉమర్ ఖయ్యామ్

683

లలన ! దయావిలోకనములన్ నను జూడుము : చూచినంతనే
కలుషము లాఱు, సంతసముగల్గు ; సదుక్తుల మామనంబులన్
దెలుపకయే గ్రహింపఁగల తేజము నున్నది లోన నీకు ; నీ
చెలువగు మానసంబు "జమసీదునిరుక్కలశంబు" నెచ్చెలీ.

684

చెలి ! మధ్వాసవ మియ్యవేమి ? హృదయక్షీణైకదీపంబు ప్ర
జ్జ్వలనం బందదు మేటిద్రాక్షరస జాజ్వల్యాగ్ని ముట్టింప కే
వలనన్ శోభయెరాదు నీమధుర నవ్యప్రేమ మధ్వాసవో
జ్జ్వల చంచత్కలశంబుపై నిడినయోష్ఠంబింక రానేర్చునే.

685

మానవజన్మ నాశము, ప్రమాదభయాన్విత, మట్టినాశమం
దే నవజీవనంబు నుదయించును గానసతంబు నా ప్రియ
ధ్యానము "జీససై" వెలసిప్రాణముఁ బోసెను దానఁజావు నా
ప్రాణముఁ దీయవచ్చియు హతాశను బోయె జితోస్మియం చొగిన్.

686

కొందఱు తత్త్వవేత్త లతి ఘోరమృషోక్తుల నాడుచుంద్రు సీ !
కొందఱు కర్మలన్ సలుపుకూళలు రంభలఁ గూడనెంత్రు ; వీ
రందఱు మూర్ఖు లీశ్వరునియాలయవీథికి నెన్ని యోజనా
లుందురొ యైహికంబనెడు నూఁగెడు నీ తెర యెత్తివేసినన్.