పుట:2015.393685.Umar-Kayyam.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

173

679

పాపము లాచరింపుఁ డనిపల్కెడు పామరులందు జ్ఞాన మే
రూపుననైన లేదని నిరూఢి నెఱుంగుఁడు; పాపమందు నే
దో పరిలోకసిద్ధు లణిగున్నవటంచు వచిం చుదుర్మతుల్
కాపురుషుల్, మహావ్యసనగాఢతమస్సునఁ జిక్కకుందురే.

680

ఈతమసావృతంబగు మహీతలమందుఁద్వదాస్యమందె తే
జఃతతియున్, సుధారసము జానగుచున్నవి పద్మగంధి ! నీ
చేతులతో నొసంగు మలశీధువు ప్రాణమునిల్బుఁ ; బ్రాణితో
భూతల మున్న దీభువియెముక్తి ; మహమ్మదు నీవె నెచ్చెలీ.

681

జ్ఞానసుధారసంబు తమకంబునఁ గాంచి తరింప ధాత్రిపై
మానవు లుద్భవించిరి ; ప్రమాణముగా నిది లేనివార ల
జ్ఞానులు, వ్యర్థు లెంతొకలుషంబులఁబొందుశఠాత్ము లౌదు రో
మానిని ! నేను తత్త్వమను మద్యమునే కడు గౌరవించెదన్.

682

ఓచెలీ ! నీ వదాన్యవిమలోదధికలో నొక ఫేనమాత్రమై
తోఁచునభంబు నీవుగల దుర్గపువీధి సజీవమైన "కా
బా" చయ మున్నదచ్చొట్టు ప్రపత్తిని బోయెదఁ ; బోవలేనిచో
నాచారమాంగ మాపథమునన్ బడి చచ్చినభాగ్యము యగున్.