పుట:2015.393685.Umar-Kayyam.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

ఉమర్ ఖయ్యామ్

691

తోలుబొమ్మలు మేము ; మాతోనభంబు
నాటకము వేసి, యస్తికవాటమందు
ముగియ నొక్కొక్క బొమ్మను మూశివేయు
పెట్టెలోఁ బెట్టి తాళంబువేయు నిజము.

692

అవనిని వీడిపోయి యొకరైనను గ్రమ్మఱిరారు ; వచ్చినన్
దివి తెరమాటుమాటలను దెల్పెడివారు త్వదర్థ మాదయా
ర్ద్రవసతిపైని మాజుపయిఁగ్రాల సమాజు దయార్థలబ్ధికై
నవయుచు నుండినట్టు లగునన్నను బాలబిభీషికల్ గదా.

693

ఏమిటి యాస్తికంబు నిదియేమిటి జన్మమటన్న నీకథా
వ్యోమము పెద్దగాధ యయిపోవును ; దీనినిజంబు నిర్ఘరీ
స్తోమమునందు బుద్బుదముతో నెనవచ్చుఁ దదీయవీచికా
స్తోమమునందు లీనమగు తోయము మానవజీవితం బనన్.

694

మాకై సృజింపఁబడె నీ
లోకము ; మే మఖిలలోకలోచనయుత ది
వ్యాకాంక్షఁ జూపువ్రేలై
యీకరణిని నారగింతుమెల్ల యథేచ్ఛన్.