పుట:2015.393685.Umar-Kayyam.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

ఉమర్ ఖయ్యామ్

675

పుట్టుటకు మున్నె నీకథ పూర్తిచేసి
వర్తమానభవిష్యత్ప్రపంచమందుఁ
గడచు పరివర్తనములు ని న్నడుగకుండ
విధి విధించె నూరక వగ వెఱపు లేల.

676

ధరణిని బుట్టు టన్నది స్వతంత్రతలోఁ గలదేని నేను నీ
ధరణికి రాను ; వచ్చిన స్వతంత్రతలోఁ గలదేని దీని నే
మఱి మరణింపఁబోను ; పలుమాట లికేటికిఁ జూపుపుట్టుకల్
పెరుఁగుట మున్నగాఁగలుగు వేదనలే పడ నొక్కనాఁడికిన్.

677

సాధులతోఁ బ్రమత్తులగు జ్ఞానునతోఁ బరిహాస మాడుచున్
బాధలఁ బెట్టఁబోకు ; కడుఁ బాపము ; మద్యమునైనఁ ద్రావి స
ద్భోధల నాలకింపు ; మిది ముక్తిపథంబున కడ్డ ; దడ్డినన్
గాధలె గాని మద్యమును గైకొనకుండిన ముక్తి వచ్చునే.

678

చెలిప్రేమాగ్నికి దగ్ధమై చనిన యీ జీర్ణాంగపున్ ధూమ క
జ్జలమే మాననవీధి మాపె; నిఁక నాసల్ లేవు లేవింక ; నే
వలనైనన్ నినుఁ గాంతునో యనుచు మున్ భావించితిన్ గాని, ని
ష్ఫలమయ్యెన్ పృథుయత్న ; మీ తెఱఁగు సంప్రాప్తించెనాదుర్దశన్.