పుట:2015.393685.Umar-Kayyam.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

ఉమర్ ఖయ్యామ్

628

కాల మది మోసకత్తె, దుఃఖములనెలవు
కష్టములఁ దోడుపడు టేరుఁ గాంచరైరి ;
వెతల కలిగిన మఱి కొన్ని వెతలుగూర్చు
ఏక్షపై రక్ష నిడు నంతరాళమందు.

629

ఒక్కపనినైన నెఱవేర్ప నోప నియదు ;
ఒక్క గ్రుక్కైన సంతొష మొప్పునట్లు
త్రిప్పనీయదు ; నే నెప్డు తిరగలేదు.
దుష్టకాలఁబు తుద కెప్డొ త్రుంచువెతల.

630

వెతలను ముంచుకంటె మఱి వేఱుప నేమియు లేదు కాల దు
ర్మతి ; కిది పాడి గాదనిన మానదు ; ముందిలఁ బుట్టబోవు సం
తతులకు నీరహస్యము శ్రుతం బగునేని ధరిత్రిఁ బుట్టఁగా
మతిఁ దలపోయ రెవ్వ రనుమానము మానుమిఁకేమి చెప్పుదున్.

631

జగమన రెండుద్వారముల సౌధము ; పుట్టెడుదారి చచ్చిపో
వఁగ నొకదారి యిందు బహు బాధలు, చావులె వేఱుగల్గ; వీ
వగరునకంటెఁ బుట్టి యొక వాసరమైనను నుండ కేగినన్.
పొగిలెడి ధాత్రిలో నసలె పుట్టకపోయినమేలు నెచ్చెలీ.