పుట:2015.393685.Umar-Kayyam.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

159

625

పుడమి విపత్తుదెచ్చు పెనుభూతము యేమఱి దీనివజ్జలో
నడువకు : ఖడ్గధార నొకనాఁడు త్వదీయ నికృత్త కంఠమం
దిడకయె పోదు ; జాగ్రత ! యిదే యిపుడైనను నోట బెల్లమే
నిడుననుకొమ్ము ; దాని దినకెంతొ విషమ్మగుసుమ్ము నెచ్చెలీ !

626

పరిపక్వమై యెఱ్ఱఁబారిన ద్రాక్షార
           సం బిడి దీనివాసఁబుడంబు
కాచపాత్ర విలాసకాంతులఁ దనరారు
           నట్టులు జీవదేహముల నెఱుఁగ
వలయు ; సొంపగు కాచపాత్ర మధ్వాసవ
           రసపూరపూరమై గ్రాలుచుండఁ
గాంచెడువారి నర్థించుచు నవ్వెడు
           చాడ్పునఁ గడువికాసమును గూర్చు

దానివాస్తవ మేమన్న ద్రాక్షరసము
నొక్కబాష్పాంబు పూరమందున్న యెఱుపు
ప్రథితహృదయాంతరాళమౌ రాగరసము
రసముతో నైక్యమైన తద్రక్తమహిమ.

627

నాకంటెన్ సొగసైన మో మెవరికైన గల్గునే యంచు శో
భాకాలాన గులాబి గర్వమున సంభావించుచున్ బల్క, నా
లొకింపన్ "బులుబుల్" వచించె నవునౌ లోకంబులోనొక్కనాఁ
డేకాశంబలె నవ్వి వత్సరము దుఃఖింపంగ వీక్షింపమే.