పుట:2015.393685.Umar-Kayyam.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

ఉమర్ ఖయ్యామ్

621

మా యధమైకజీవితప్రమాదమునం దొకయూర్పె సాగి, కన్
దోయిని నించు నశ్రుకణ తోయమె జాహ్నావి ; మా వృథావిషా
దాయతకీలిలోని యొక యంశమె యానరకంబు ; మాసుఖ
శ్రీయుతకాలమం దొకవిశేషమె స్వర్గము చెప్పవచ్చినన్.

622

ఏ హృదయంబు సంగమును, నీప్సితముల్ విడనాడకుండునో
యా హృదయంబు ఛిద్రముల కాస్పదమై వెతలొందు ; నే నరుం
డైహికకర్మవాసనల యందు స్వతంత్రనొందు నాతఁడే
మోహముఁబాసి మోదమును బొందును దక్కినవన్ని దుఃఖముల్.

623

బ్రతు కొకనాఁటి దొక్కత్రుటిపాటిది ; యైన ముదంబుతోడనే
బ్రతుకుము ; చూడు జాగ్రత ! ప్రపంచముసర్వము భోగభాగ్యముల్ ;
బ్రతుకుటలోనె ఉన్నది ; నిరంతరమున్ భవదీయజీవిత
ప్రతతుల నెట్లు మార్చినఁ బ్రపంచ మదేగతి మార్చు వ్యక్తులన్.

624

"జమ్మ"ను పానపాత్ర కయి సర్వజగంబులు చుట్టి వచ్చి దుః
ఖమ్మున రేబవల్ గరఁగి కంతికిఁ గూర్కును, నొంటికిన్ సుఖం
బిమ్మెయి మానియుండ గురుఁ డీ "జము" గూర్చి వచింప సర్వలో
కమ్ముల కాశ్రయంబయిన కాయమె జమ్మని నా కొగిన్.