పుట:2015.393685.Umar-Kayyam.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ఉమర్ ఖయ్యామ్

161

౬౩౨

పగలు, రేయు విచారాలఁ బొగిలి పొగిలి
వ్యర్థనిమ్నోన్నత పథాలఁ బాఱి పాఱి
యంతులేని ప్రయాణాల నాస లనెడు
వ్యసములకన్న వేఱేమి వసుధఁ గలదు ?

౬౩౩

కడచిన నాఁటికోరికలకై వగగుందెడు జీవటోలముల్
గడవగనున్న కాలమునకై విలపించుచు ముక్కముక్కలై
పడెడు మనంబు నెచ్చెలి ప్రపంచక జీవిత సంగ్రహంబు లీ
వడువున దుఃఖమున్ భయము వచ్చుచుపోవు ధినాలవెంబడిన్.

౬౩౪

"వన మను గ్రీసుదేశమున వ--- యూసుపువంటిదాన, నా
మణులనుబోలు వాతెఱయు మంజులచారు హిరణ్యగర్భ మిం
పునఁ గల" దంచు గర్వపడు పువ్వును నీవెటు యూనుఫౌదు వం"
చన నది రక్త నిక్తపవనాభములౌ తవ రెక లిందనన్.

౬౩౫

చచ్చెడుదాఁక నీధర విచార విషాద విసంకటంబుల
వచ్చెడు ; సౌఖ్యమన్న దొకవానరమైన నెసంగఁ బోవ ; దిం
దిచ్చపుసౌఖ్యమే పడయ నెంచిన వేగమె చచ్చిపోవుటో,
మ్రుచ్చిలు ధాత్రిపై నసలె పుట్టుకపోవుటో మేలు నెచ్చెలీ.

21