పుట:2015.393685.Umar-Kayyam.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

ఉమర్ ఖయ్యామ్

566

కెంబెదవి గల్గు నారత్నకం బ దేది
ప్రాణమును బోయు మధ్వాసవంబ దేది
మద్యపు న్ని షేదము ముసల్మానమైన
మధువుగొను మేడ్వకిఁక ముసల్మాన మేది.

567

పరకీయంగని యోగియెక్కఁడు "మహాపాపంబులన్ జేయుదే
తరుఱీ !" యంచన నామె "పై కెటులు నేఁదర్కింపఁగా నుంటి నా
కరణిన్ లోపలనుంటి ; నీ వెటు పయిన్ గాన్పింతువో లోన నా
కరణిన్ గ్రాలెదవొక్కొ చెప్పు" మన దిగ్భ్రాంతింగనె న్యోగితాన్.

568

సంతతము నీవు నన్నుఁ బాషండుఁ డనుచుఁ
దిట్టుచుందువు గాని నాయట్టి నేనె
యలరుచుందును ; నెందు న్యాయైకబుద్ధిఁ
జూడఁ బరదూషణము నీకు శోభ యిడునె ?

569

మలిన మశాశ్వతంబయినమాయజగంబు, ధనంబుపై మదిన్
నిలిపి నరుండు భ్రాంతుఁడయి నీరసవాంఛల మున్గితేలు చే
కలననొ హాయిగా నొకటఁ గాలముపుచ్చఁగ నెంచియున్న నా
కలననె మృత్యుదేవి కరకంజము గైకొని వాని లెమ్మనున్.