పుట:2015.393685.Umar-Kayyam.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

143

562

ఏమల ఖాను నా బిరుదు నిద్ధకిరీటము విక్రయించు చు
న్నా మల నిల్వుటంగియును, నైజముగాఁ దలపాగ వేఱునా
దామలగీతి కమ్మితిని ; యారయ మోసమటన్న వాహినీ
స్వామి జపౌఘమాల మధుపాత్రకునై తెగ నమ్మినా మొగిన్.

563

ఏటికి మమ్ముఁదిట్టెద విసీ ? మతిమాలిన కర్మశుంఠ ! ము
మ్మాటికి మేము వాద్యముల మానినులన్ మధుపానశాలలం
దాటలఁ బాటలన్ బ్రతుకు హాయిగఁ బుత్తుము ; నీవు మాలికల్
బూటక వేషభాషలును బూనియుఁ బొక్కుచునుందు వెంతయున్.

564

ఆహితాగ్ని, ప్రమత్తుఁడనైన నగుదు
నర్చకుఁడు కుత్సితుండనునైన నగుదు
నెల్ల తెగ లాడు నన్ను నించించుకైన
నే స్వతంత్రుఁడ నేను నే నేను సతము.

565

పుణ్యకీర్తి గడిండుట పోలుఁగాల
నిహతిఁ బొక్కుట పోలదు ; నిరుపమాన
బాహ్యజపతపముల గర్వబడుటకంటె
మద్యవాసనచే మేనుమఱవ మేలు.