పుట:2015.393685.Umar-Kayyam.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

145

570

అ స్తియటన్న దాన నిసుమంతయు లాభములేదు ; దానినే
నా స్తియటన్న దాన నిసుమంతయు నష్టములేదు ; దేని మీ
ర స్తియటండ్రొ యయ్యదియె నాస్తిగ నెంచుఁడు ; దేని మీరలున్
నా స్తియటండ్రొ దాని నొగినస్తి యటంచు గ్రహింపుఁడెంతయున్.

571

ఱేపు లభించునన్నదొక రేణువు నున్నదె భ్రాంతిగాని ? యీ
రూపమహాపవాదములు రూఢియె మిథ్యలుగాని ? భ్రాంతులన్
రూపఱనట్టికోవిదులు రోసి జగఁబొకలిప్తయంచు నే
మాపును, రేపు, నెంచెదరు మానసవీథిని సానుభూతులై.

572

పెక్కుకళాగుడారములు వీఁగఁగ మాయఁగఁజేసితో "బయా"
మక్కట జాఱిపోతివి వ్యధాగ్నిని దగ్ధము లయ్యె రాట లా
ఫక్కినె మిత్తికత్తెర గుభాలున నాయువుత్రాళ్ళు త్రెంతె నా
చక్కినె నాశనంబనెడు సాహుడు నూరక విక్రయించెడున్.

573

తనువు గుడారువంటి దది తాల్చిన జీవుఁడు ఱేనిలీల నం
దనువుగ నుండిపోవు దివికారయ ఱేఁడు గుడారమందు లేఁ
డని మృతియన్న కాలభటుఁడంతట వచ్చి గుడారమెత్తి వే
యను ; నిఁకనొక్కచోట నిడనూహను యత్నముచేయుఁగ్రమ్మఱన్.