పుట:2015.393685.Umar-Kayyam.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

ఉమర్ ఖయ్యామ్

558

ఆసలు నూహ లన్ తలుపులన్నియు మూసితి; నుత్తమాధముల్
చేసెడు సాయపాటులకుఁ జేతులుచాచు నవస్థలన్నియున్
బాసితి ; నే "మసీదుముతవల్లి" ని గాను, శివార్చకుండఁ గా
నోసఖి ! యిప్పు డే నెవరినో యదె సాక్షిని నేనె దీనికిన్.

559

మధురవనంబులన్ దిరిగి మద్యము ద్రావెడువారికెల్ల నే
నధిపతి ; నీశ్వరార్చనలనన్నిటినిన్ విడనాడి పాప దు
ష్పథమున నుంటి ; నిండుమధుపానముఁ జేసి హృదంతరాళపున్
రుధిరము మ్రగ్గగాఁ దమి నిరూఢసమాధిని నుందు నారయన్.

560

ఓ ప్రభూ ! మేము నీకంటె నుత్తమోత్త
ములము ; నీవు ప్రజారక్తమును గ్రహింతు ;
వేము ద్రాక్షరస బు గ్రహింతు ; మిందు
నెవరు ఘోరపాపులొ మన మెఱుఁగలేము.

561

ఏదియొ కోర్కెతోడనె "మసీదునకున్" జనుచుంటిమంతె ; యా
మోదముతో నమాజునకుఁబోవుట లే దొకనాఁడు నేను మ
స్జీదు కవాటమందు నొకచెప్పును దొంగిలిపోయి యిప్పు డా
పాదుక పాతగిల్లె నని వచ్చితి రెండవసారి యర్థినై.