పుట:2015.393685.Umar-Kayyam.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

141

554

కోవిదముఖ్య ! సాటిజనకోటి నసూయతఁ జూడఁబోకు మం
దీవు యథార్థమున్ దెలిసితేని శ్రుతిస్మృతులన్ వచించు వా
రే వివిధార్థముల్ దవిలి హీనవధూఋతురక్తసిక్తభా
వావధి ముట్టి పాయరు మహాకలుషైకమలీమసంబులన్.

555

ఎంతకాల మజ్ఞానినై యెసఁగుచుందు ?
మతివిరక్తిని పడి, ముసల్‌మాను మతము
విడిచి, జందెమ్ము వేయుదు ద్విజునిభంగి ;
నేల యన "మోమి" ననఁగ లజ్జించుచుంటి.

556

వింటె యొకనీతి చెప్పఁగానుంటి, నొరుల
మాయసేయకు స్వార్థంబు మాటుపఱచి
యిహ మశాశ్వత మిట్టి యైహికముకొఱకుఁ
బారమార్థికపదవి, గోల్పడఁగవలదు.

557

ప్రజలు వచింత్రు నన్ను మదిరాసముపాసకుఁ డంచు ; గొందఱీ
ప్రజలె వచింత్రు నన్ నతము బ్రహ్మవిదుండని ; యిట్టివన్నియున్
నిజములొ కావొ బాహ్యముననీవు ననున్ నిశ్చయించి చె
ప్పఁ జనకు మంతరంగ మెటువంటిదొ నే నటువంటి మానిసిన్.