పుట:2015.393685.Umar-Kayyam.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

ఉమర్ ఖయ్యామ్

550

ఎవఁడు కీర్తినిదలఁపఁడో, యెవఁడు యజ్వ
శాటిగట్టఁడొ, "సీయుర్గు" సాటి మింటి
కెగయఁడో, లోక మను గుడి కెవఁడు శ్వాశ
తార్చకుఁడు గాఁడొ వాఁడె సౌఖ్యప్రదుండు.

551

కావిగుడ్డలుకట్టి, సిఖ్యాతులైన
వారలకు రెండు రొట్టెలు భంగొసంగె
నేనిఁ జాలును ; నుబుసుల మౌనులండ్రు
కాని, కాఠిన్యమున వారుఘనులు నిజము.

552

ఎవఁడు కృష్ణాజినంబుఁ బూజించు, వాఁడు
గాడిదయి మోయు వైరిషట్కముల బరువు
ఆర్యనటనచే ధర్మమ్ము నమ్ముకొనెడు
నతఁడు చండాలుకంటెను నధముఁ డరయ.

553

మధుకలశంబుపై ముసుఁగు మండిత "జంషిదు" రాజ్యధాటికే
నధికము ; కల్లుకంపు "మరియాంబ" కొసంగినపండ్లకంటె న
త్యధిక ; "మబూసయీదు, అరహంబుల" ప్రార్థనకంటె వేయి రె
ట్లధికము మద్యపాయి యుదయంబునఁ బేరెదఁ బుచ్చునూరుపుల్.