పుట:2015.393685.Umar-Kayyam.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

139

546

కాలం బెఱుఁగని యర్థం
బేలే దెల్ల రహస్య మెఱుఁగును ; దీనిన్
దూలించి మాయసేయఁగఁ
జాలుదువే ? ప్రజల కర్మసాక్షియె గాదే.

547

ఒకనిసియైన నిష్ఠ నెద నూహ యొనర్పఁడు ; తామసంబు లే
కొకయడుగైన వేయఁ ; డల యుర్విజనంబులకంటె మించి తా
నొక యపురూపపూజ్యుఁ డని యువ్విళు లూరును ; నిట్టివారిచే
నకలుషులైన యోగులు, మహాత్ములకెల్లఁ గళంక మయ్యెడున్.

548

అవనిజసంబు క్రూరులు, మహాకలుషాత్ములు, తుంటరుల్, మృదం
గ విధము వాగుచంద్రు మొనగాండ్రని ; లోన లొటార మిట్టివా
రవిరళ పూజ్యభావమున నంఘ్రులు ముట్టఁగఁ గొల్చు కోరికన్
దవిలెద వేని పుణ్యచరితంబును నేర్పుము వారి కర్థివై.

549

ఆ మధుశాల మాధ్వులు మహాత్ములతో విలసిల్లుఁగాత ! మా
యామతు, లాహితాగ్నుల పటాంచలముల్ శిఖి దగ్ధమౌత ; నా
నామహితప్రపూత సుగుణ ప్రతిపాదిత రక్తశాటి యెం
తే మధుపానమత్తశయనేప్సితుపాదములన్ నశించుతన్.