పుట:2015.393685.Umar-Kayyam.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

137

538

దీపముభంగి మండుచు సతీ ! నిసిఁ బుచ్చిన మాకు గ్రుక్కనీ
రోపఁగఁ బోయుదేని హృదయోదితదాహాము దీఱు ; లేనిచో
నే పృధులానిలంబునొ హరింపఁగాఁ బంపుము దీప మాఱిన
ట్లేపఱి యాఱిపోయి భవదీప్సితసిద్ధికిఁ బ్రాణ మిచ్చెదన్.

539

ఆప్రభాత మద్య మాహార మాత్మకు
నీదు దర్శనంబు నిజముగాఁ బ్ర
భాత తరణి ; లెమ్ము భవదీయపదముల
కెరఁగి ప్రాణమిడెద విదియె సతము.

540

మదువును ద్రావవేని, వినుమా మధుపానము సేయువారలన్
వ్యధఁబడి తిట్టఁబోకు ; మెపుడైన యధావిధిఁ ద్రావువాఁడె స
త్సథమునఁజేరు ; నీవు శతథా మధుపానము సేయకున్న నా
మధువును మించు పాపములు, మాయలు సేయుట మానినావొకో.

541

కాలం బనుకూలించిన
ఱాలన్ బ్రజరువ్వి నాశిరముమోదనిచో
పాలుఁడు సుర వీడిన వి
ద్యాలయమున భంగభావ మగు టచ్చెరువే.