పుట:2015.393685.Umar-Kayyam.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

ఉమర్ ఖయ్యామ్

542

"తూసు" కంటెను కైకుబా ద్కోట" కంటె
"కావుసును" ప్రాజ్యరాజ్యము కంటె మధువె
ఘనము ; కఠిష్ఠి బాహ్యప్రార్థనముకంటె,
కర్మబాహ్యుని యొక యశ్రుకణము ఘనము.

543

జలధినిబోలెడు హృదయము
వెలియై చెయిజాఱి యెందు వెడలును గర్వాం
బులు నిండి ? దీనికిడ సుర
తలతోడను నడచిపోవుఁ దలబోరలయై.

544

భూతలభోగభాగ్యములు పోయెను ; బోయెను పానపాత్ర ; లీ
చేతము చేత లేదు ; మఱి చెచ్చెఱ వీణను లేక వేణునం
దీఱిత లేదు యోగులు నిసీ మధుపానము మానివేసి రా
భూతలనాథుఁ డొక్కఁడె ప్రపూర్ణ మధుద్రవ మాని చొక్కెడున్.

545

అతుకులమారి బొంతలు సుమా ! మతకర్మలు చేయువారు స
ద్గతి హితమార్గమం దెపుడుఁ గా ల్నిలుపన్ దలపోయ రజ్ఞులై
శ్రుతులను, "ఆలులో" లనెడు సూక్తులఁ గొన్నిఁటినేర్చి యీవివా
దతతి మహాత్ము నొక్కని వృథా యపవాదముఁ జేసి రెంతయున్.