పుట:2015.393685.Umar-Kayyam.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

ఉమర్ ఖయ్యామ్

534

ఓ యువతీ ! త్వదర్థము వియోగమహాగ్నికి నింధనంబునై
పోయితి ; నీ వదెచ్చటకిఁ బోయిన నా కరమెప్డు పయ్యెదన్
బాయదు ; నీవు వాసితివి బాపురె ! ప్రాణము లెన్ని నాశమై
పోయెనొ చూడు మాయుసురు పోయుము నేబలియౌదు నీకొగిన్.

535

నీదాసుండను జూడవేమి యువతీ నీముందె నాశీర్షమా
మోదంబారఁగ వంచినాఁడ నొరులన్ మోమెత్తి వీక్షింప ; నీ
వాదే నిందలపాలు చేసినది విశ్వంబెల్ల ; నీచేత నే
వాదున్‌బొందను జాలుఁ దక్కిన వసంభావ్యంబు లూహింపఁగన్.

536

మగువా ! నీదు కటాక్షవీక్షణములన్ మాబోటి నిర్భాగ్యులన్
వగలన్ గూరెడువారి నారసియుఁ దాపం బార్చుమీ ! మేము నె
వ్వగ నిర్జీవఝషాకృతిన్ గలము ! మాపై నీసుధావృష్టి సొం
పుగ వర్షింపుము ! ప్రేమపూర్వకముగా మోదంబు సంధిల్లఁగన్.

537

పడతీ ! నీదుకవాటమున్ వదలిపోవంజాల నెచ్చోటి కే
ర్పడఁగా, నాతలఁద్రుంచినన్ నెపము నీపై మోపఁగాఁబోవ ; నె
య్యెడలన్ నాతల ధూళి బ్రుంగినసరే నీవెత్తఁగా జేర ; వీ
యెడలన్ నాతల నీదుపాదములపై నేనుంచి యెత్తన్‌జుమీ !