పుట:2015.393685.Umar-Kayyam.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

133

522

ఓ వగలాడి ! యేరయిన నూహ నెఱింగిరె నిన్ను సుప్తిలో ?
భావనఁజేసిరే తెలివివల్లఁ భ్రియానవమందు మైకమున్
గేవలమున్న నిన్ దెలియనేర్తురు ; గావునఁ దెల్వికంటె నీ
పావనమైన ప్రేమరస భావ ప్రమత్తత మేలు గాదెకో.

523

ఏనును గందు నాస్తికత యేమియొ, నాస్తిక మేమియో, యధో
ర్ధ్వాన రహస్యమేమియొ ; పదంపడి యీవిధమైన భావ వి
జ్ఞానముకంటెఁ దన్మయత గల్గిన యావలఁ గల్గు గౌరవ
స్థాన మెఱుంగవచ్చునెడఁ జాలును దక్కినవెల్ల వ్యర్థముల్.

524

కర్మకషాయశాటిక వగన్ సురలోపలఁ బాఱవైచి, యా
నిర్మల మద్యశాల ధరణీపృధుభూతి నలందికొందు ; నీ
ధర్మము వీడి వీత మధుధాత్రి మనస్సును వ్యర్థపుచ్చితిన్ ;
గూర్మిని మద్యశాలఁ జని కూర్చెదఁ బోయిన యాయువంతయున్.

525

గడ్డమె పెద్దచీపురుగఁ గట్టి సురాంగణ మూడ్తు ; మంచికిన్
జెడ్డకు స్వస్తిచెప్పితి నిసీ ! త్రిజంగంబులు బంతులట్లు చే
డ్పడ్డవిధానఁ గూలిన లవంబుగనైనను లెక్కసేయ ; నే
నొడ్డిలి నిద్రపోవుచునె యుందుఁ బ్రమత్తుఁడనై తలోదరీ !