పుట:2015.393685.Umar-Kayyam.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

ఉమర్ ఖయ్యామ్

526

మతిగలవాఁడవేని ! మృతిమానిని మద్య మొసంగి మత్తతన్
మతిని వెలార్చుపూర్వమె ప్రమత్తత నేరిచికొమ్ము ; నైజసం
గతిని బ్రమత్తభావములు గల్గుట దుస్తరమౌను నీకొగిం
బ్రతి మతిలేనివాఁడు మతిమాలినవాఁ డనరాదు నెచ్చెలీ !

527

జాగ్రదవస్థ భోగములు సంతసముల్ గనరావు ; నిద్రలో
వ్యగ్రత నొందు బుద్ధి ; యుభయాంతరవస్థల నంధి నొక్క యూ
హాగ్రపదం బ దున్నది ; తదర్థము నే స్మరియించుచుందు ; నెం
తే గ్రహింప నాపదమునే బ్రతుకందురు వాస్తవంబుగన్.

528

ఓ మృదుగాత్రి ! మాసుర త్వదుజ్జ్వల రాగసమ్ముసుమ్ము ! నీ
కేమియు దృష్టిదోషములు నేర్పడకుండుత ! నీదుమోవియే
ప్రేమతటాక ; మెందఱొ ప్రవీణులు "క్రైస్తవ కాఫరాదు" లెం
తో మధువాంఛఁ ద్రావెదరు నొయ్యన.............

529

ఓ యిభయాన ! నీ విరహ మొయ్యన నా హృదయంబుఁ గాల్చియే
పోయెను ; వచ్చిచూడు మిఁకఁ బోయెడుప్రాణిని దెచ్చు వెజ్జు నా
ప్రేయసి వీవె, నీకొఱకు వీడెద గ్రుక్కెడు ప్రాణ మీయభీ
ప్రాయము ప్రాణిఁ బ్రాణములు ప్రాకెడుదాఁకను బోదు నెచ్చెలీ !