పుట:2015.393685.Umar-Kayyam.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

ఉమర్ ఖయ్యామ్

518

సుర నాకు నిత్యజపమై
పరఁగును ; మాయాస్తి సురకు వ్యయపఱిచెదఁ ; గొం
దఱు నీకు బుద్ధి కా దం
దురు ; వారలబుద్ధి నాకుదుచ్ఛము కంటే.

519

తెలివితేటలు గలవారు కలఁడు, లేఁ డ
డన్న భ్రాంతులఁ జెడిపోయి రజ్ఞులగుచు
నార్య ! విజ్ఞానివై త్రావు మాసవంబు
ప్రాణ మిచ్చెద ఱెందఱో దీనికొఱకు.

520

నీవే దేవి వఁటన్న నీప్రతిమ నెంతేఁ గొల్చుటే మేలగున్
నీవే మద్యమొసంగెదేని మమతన్ సేవించుటే లెస్స ; యో
దేవీ ! దీని కతాన నీప్రియ మహాదివ్యాగ్నిలో దగ్ధమై
పోవన్‌జూచెద నస్థికంటె నసదై పోఁజూతు వేయేటికిన్.

521

సొగసుమిటారులన్ గలసి సోమరసంబును ద్రావుటే హితం
బగు ; నగచాటులన్ బొగిలియార్చును నేడ్చుటె యెంతయో హితం
బగు జగదీప్సితతార్థముల యన్నిఁటికంటెఁ ;గృతఘ్ను వేడి నిన్
జగతి యెసంగనీ దన వజస్రము మైకమునుంట పోలదే.