పుట:2015.393685.Umar-Kayyam.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
131
ఉమర్ ఖయ్యామ్

514

కామి సతంబు మైకమునఁ గాతరు రీతిని నిల్చి నిందలం
దేమణియుంటఁ జెల్లు ; క్షణమేనియు మేల్కొనియున్న దుఃఖ కీ
లామహితంబు లెల్లయెడలన్ గనుపట్టును గాన మైకమం
దేమఱియుంట లెస్సయగు నెంతయుఁ గాఁగల దాఁగ దేడ్చినన్.

515

ఈ మధుశాల మద్యమును, నేనును, నాయిభయాన చిక్కియు
న్నాము ; మదాత్మ, నాతనువును, నామతి దీనికె యమ్ముకొంటి, నిం
కేమిటిలెక్క యీశు దయకేనియు, నాతని శిక్షకేని ? యీ
భూమిని నగ్ని వాయుజల భూతములన్ దెగవీడనాడితిన్.

516

తోయజనేత్ర ! నీ వలపు దుఃఖముచే హృదయంబు దగ్ధమై
పోయి ప్రమత్తతన్ గలఁగిపోయెను ; మద్యపు మత్తుకంటె న
య్యో ! యిది మించిపోయె ; నధికోక్తుల నాదురవస్థ చెప్పఁగాఁ
బోయిన దానికంటెను నపూతమెనా వగ దైవసాక్షిగన్.

517

మత్తమతులెల్ల నరకాన మ్రగ్గుదు రను
మాట నీవెద నెంచఁగా మానుమింక ;
మత్తులే నారకంబున మ్రగ్గునెడల
స్వర్గ మొక్కయెడారి గావలయుఁగాదె ?