పుట:2015.393685.Umar-Kayyam.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

127

498

ఒకనిట్టూర్పున కెల్ల జీవితము నుద్యోగింతు నేనమ్మఁగా ;
నొకదుఃఖంబున కెల్ల సంతసము నుద్యోగింతు నేనమ్మఁగా
నొకటన్ నా శతజీవముల్ కలిపి యుద్యోగింతు నీ పాదధూ
ళికి వేడ్కన్ బలిసేయు నెయ్యమున వేలీలన్ సరోజాననా !

499

అరయ నానాతి ; వేదాంతి నగుదు నేను ;
వినను బాషండ వాదముల్ వీనులారఁ ;
గాని, నావంటి వెంగలివాని కీ ని
షేధములు కూడ వనుచు వర్జించినాఁడ.

500

నీ ప్రేమకొఱకు బాధల
నేప్రొద్దు సహింతు ; శపథ మిదె లయమగుదాఁ
కీ ప్రాణమున్న నీ విడు
నా ప్రాణాపాయ వేదనావళి కోర్తున్.

501

ఓ వగలాఁడి ! నీదు విరహోదధిబాధల డిందు మైకమం
దీ విధి నా విపత్తనెడు హీనపుబంటును నీ తురంగ మెం
తే వెసఁ గట్టివేసినది ; నీవిడు నేనుఁగు రాజు నడ్డె ; నే
నీ వదనంబుఁ జూచుచును నిల్వున నీరయి యుంటి నీగతిన్.