పుట:2015.393685.Umar-Kayyam.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

ఉమర్ ఖయ్యామ్

494

తిలకము దిద్దితంచు భవదీయ ముఖేందుకళా విలాసమం
దలఁతి ఘటింపలేదు ; ప్రమదాకృతిఁ జెక్కిళులన్ గులాబు లిం
పొలయఁగ మున్నె నీదు వదనోజ్జ్వలవన్య నెలర్చి రాజిలున్
గలికిరొ ! దాని కిప్డు తిలకం బనుశాఖ వికాస మిచ్చెడున్.

495

మృగనాభిన్ బురుడించు నీకురులు ; నారీ ! నీదు బింబోష్ఠమె
న్నఁగ జీవప్రతిపాదకం బగుచుఁ జెన్నారున్ ; భవద్వ్యక్తిసొం
పగు వందారు "సరూ" తరూపమముగా భావింతు నే ; నందుచే
నెగడున్‌గర్వముతో "సరూ" తరువుపై కాకాశమున్ జూచుచున్.

496

ఏ మిషనైన నీ వలపు నే ప్రకటించెద ; నిన్నుఁగూర్చి నే
నే మృదుగీతి పాడినను నింతిరొ ! మైకము గూర్చుచుండు ; న
న్నీమహిఁ గూల్చివేయుటకు నీక్షణబాణచయంబు లేటి కో
సామజయాన ! నీభ్రుకుటి సంజ్ఞ యొనర్చు టొకండె చాలదే ?

497

నీ యాయువు నా దుఃఖము
చాయన్ బ్రియ ! పెరుఁగుఁగాత క్షణమాత్రమయేన్
నీ యనురాగముఁ జూపితి
వే యిది సుకృతంబు నీటనిడినట్లు సుమీ.