పుట:2015.393685.Umar-Kayyam.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

ఉమర్ ఖయ్యామ్

502

నీకురులన్ గ్రహింపఁ దరుణీ ! కరయుగ్మము చాచినాఁడ ; నీ
నాకరపాళి భౌతిక మనం దగదాత్మమయమ్ము సుమ్ము ! నే
నాకురులందు నా చలితమైన మనంబును జూచినాఁడ ; నౌఁ
గాక ! మదాత్మపైఁ గరయుంబులు చాచినపోలి కయ్యెడున్.

503

నన్ను నీవాడఁగాఁ జేసికొన్న నేను
వలచి వేఱౌదునే ? నాదు బాష్పవారి
నిముసమైనఁ గన్నెత్తి యే నెలతనైనఁ
జూడ నీయందు ప్రేమ నేజాడనైన.

504

ప్రేమరసైకవీచికల వేఁగి చలించిన దీనమానసం
బేమఱి మూర్ఛలో మునిఁగి యేటికొ లేవదు నేఁటిదాఁక ; నా
హా ! మృతికాంత వచ్చి మధురాసవమిచ్చిన లేచివచ్చునో
యేమొ యెఱుంగరా దెడఁద నేఱయి నెత్తురు పొంగిపొర్లఁగన్.

505

మృతుల పొరిన్ శరీరము ధరించిన, నేను పలాశ పుష్పసం
తతిఁ బురుడించు బాష్పములు ధారలు గట్టుచుఁ గాఱుచుండఁ ద
త్క్షతజములోని మేల్ముసుఁగు కైవసమున్ బొనరించి తాల్చుచున్
గుతకము మీఱ లేచెదను కోమలిమెట్టిన వీధిముంగిటన్.