పుట:2015.393685.Umar-Kayyam.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

ఉమర్ ఖయ్యామ్

478

ఓసుర ! నావధూటి యధరోష్ఠమధుద్రవ మంటుచుంటి వా
హా ! సుకృతంబు ; నీహృదయ మంతయుఁ బ్రేమరసంబుతో సుధా
వాసితమై చెలంగుటను వాతెఱకెందొవ నాశ్రయించి నీ
వీ సహజాకృతిన్ బడసి తింకఁ గృతార్థవుగాదె మద్యమా !

479

నాకడ నుంపఁబోవ రొకనాఁడును నిన్నుఁ ద్వదీయబంధు ల
య్యో ! కడు బాధలన్ గుడుపుచుండిరి నాహృదయాంతరంబునం
దేకరణిన్ ద్వదీయతరళేక్షణముల్ ప్రసరించు నింక ? హా !
నీకయి వేచియుండిరి యనేకు లదే పరమాణులట్లుగన్.

480

నామదిఁ బ్రేమబీజమును నాటితి వంతముదాఁక దీని నే
నామది దాచియుంతు ; నెలనాఁగ ! త్వదీయ విలాసచేష్టలం
దేమఱి నన్నురోయ, కెపుడేనియు నీమఱుఁ గాశ్రయించి నీ
పై మతి నిల్పి నీచెఱఁగుఁబట్టి తరించెద వీడ నేయెడన్.

481

ఓయిభయాన ! నీదు మధురోష్ఠసుధన్ గొనుమంచుఁ జెప్పు మై
రేయము మానఁబోవను శరీరమునం దసు వున్నదాఁక, నో
గాయని ! నిన్నుఁ జూడఁ గడుఁ గాసిలుచుంటిని ; యిట్టులాడుటే
నాయపరాధమైనను, మనంబున నెంచకు ప్రేమ యేర్పడన్.