పుట:2015.393685.Umar-Kayyam.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

123

482

అండజయాన ! నీదువిరహంబున లజ్జఁ బరిత్యజించితిన్ ;
వెండియు బుద్ధిహీను లపవిత్రులతోడఁ గుతర్క మేల ? వీ
రుండు సతంబు ప్రేమరసరూపసుధన్ గడుఁ గ్రోలుచుండు ; హీ
నుండు నపుంసకుం డెఱుఁగనోపునె యా పరమార్థ మారయన్.

483

చెలి ! నీబాస తిరం బని
పలుకులు నిజ మంచు నెదను భావించితిని ; నో
లలనా ! లోకమువలె వి
హ్వలమును, నాభాస మనుచు నరయఁగనైతిన్.

484

చెలి ! నీముంగురు లెందఱిన్ వలపుమైఁ జెండాడెనో చూచితే
చెలి వక్రాలకముల్ గదా గరువమాజిన్ పంపగరాదె య
న్నులమిన్నా ! ఫల మేమి నీవలన నేనున్ జూడలే దెప్పు డ
న్నులమిన్నల్ ఫల మిచ్చు టెవ్వరయిన్ జూడన్ దటస్థించెనే.

485

పదివేల్పుల్, గగనాలు తొమ్మిది, మహాస్వర్గైకలోకంబు లె
న్మిది, నక్షత్రము లేడు, షడ్దిశలు, తూణీరాభపంచేంద్రియా
స్పదముల్, నాలుగుభూతముల్, త్రిగుణశక్తుల్ గల్గు నీ భూనభః
పదమం దీశుఁడు నిన్నుఁబోలె నొకతెన్ బద్మాక్షి సృష్టించెనే ?