పుట:2015.393685.Umar-Kayyam.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

121

474

లలన ! నాకీవు పూజ్యరాలవు ; ధరిత్రి
నిన్ను శిరసావహింతు నేమన్నఁగాని
యసువుకన్నను నథిక మీయవని లేదు
కాని, నీకన్న నసు వధికంబు గాదు.

475

నీ విరహాగ్నిచేఁ గరఁగి నేలను గాలిని రాలినట్టి యా
రావిదళంబుకైవడిని గ్రాలుచు సంచిలనంబు నొంది మ
త్తావిలచిత్తవృత్తి నురియాడెడు నాకడ కిప్పు డెవ్వ రీ
త్రోవను జాటు మాటు నినుఁ దోడ్కొనివచ్చిరొ చెప్పు నెచ్చెలీ !

476

నవ్వులదివ్వె ! నీదుచరణంబుల ముద్దిడుటన్న వేలుపుం
బువ్వులబోండ్ల వాతెఱల ముద్దిడుకంటెను మేలు ; రేలు ని
న్నెవ్విధినైనఁ బట్టుకొన నెంచియు దిక్కులు బాఱుచుందునా
నెవ్వగ సిగ్గుఁ జెంది దిన మెంతయుఁ బుత్తును నేకతంబునన్.

477

నా మది వలచినచెలి వే
రే మార్గమునందుఁ బడి కృశించెడు ; నిఁక నే
నేమని యత్నింతు ? రుజా
స్తోమశరీరుండ నగుచు స్రుక్కుచు నుంటిన్.