పుట:2015.393685.Umar-Kayyam.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

119

466

కల్లుం ద్రావిన నీచమానవుల సఖ్యంబందుఁ గూర్చుండఁగాఁ
జెల్లన్‌బోవదు ; ప్రేమగానకలనన్ శ్రీరాగరాగాంచితో
త్ఫుల్లాస్యల్, నళినాక్షులం గలసి సంతోషించుచున్ ద్రావఁగాఁ
జెల్లున్ వేడుక నప్పు డప్పుడు సముత్సేకంబు సంధిల్లఁగన్.

467

సుమములపైని మేఘపు ముసుంగు తొలంగ గలేదు ; నాదు హృ
త్కమలము మద్యవాంఛఁ బరితాపము నొందుచు నున్న దింక నీ
సమయము నిద్రకుందగ దుషస్సిది, పండెడువేళగాదు మ
ద్యము చషకానఁబోయుము ప్రియా ! మనకున్నదిప్రొద్దుచాలఁగన్.

468

మదువు గైకొని మతిమాలి మసలఁబోకు ;
మైకమునఁ బామరుండవై మాటలాడ
కాసవమునఁ ద్రావనీకు బేరాసయున్నఁ
ద్రాగి పీడింప కొరుల మర్యాద మాని.

469

దయయే స్వర్గము, విధి ని
ర్దయయే నరకంబు ; స్వర్గరాజ్యము విధి కా
లయ మే ననఘుఁడను సురా
లయమునఁ జొరనీయరేల లలనా ! నన్నున్ ?