పుట:2015.393685.Umar-Kayyam.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

ఉమర్ ఖయ్యామ్

462

సురఁ ద్రావమాను మందురు
సుర నాప్రియవదన మనుచుఁ జూచెద నిఁక మీ
రరఁయుడు దీనికిమించిన
పరమార్థం బేది గలదొ పరికింపంగన్.

463

నిసిని ద్రావినసుర మైకమెసగదేని
పవలు ద్రాఁవగ నోపను ; పవలె సురను
ద్రావు మనెదవు గాని, నేఁద్రావఁబోను
పగలు సుర ద్రావుటది శుభాస్పదము గాదు.

464

మధుసమయంబు సొంపయిన మారుతముల్, జలదంబు దూసరిన్,
బృధుకుసుమావళిన్ గడిగె ; వేడుక "బుల్ బులు" వచ్చిపాండుర
ప్రథితసుమాళితో "మధువుద్రావుడు ; మీరుజ శాంతిబొందు" నం
చధరము విప్పి విప్పి మధురామృతగానము సేయుఁ జూచితే !

465

మధువు నీచులతోఁ ద్రావమానుకొనుము
దానఁ గష్టాలు కలుగు ; మద్యంబు రాత్రిఁ
ద్రావి కలహించి పగలు తద్వర్తనమునఁ
బ్రజలు బ్రతిమాలవలయు శిరంబునొవ్వ.