పుట:2015.393685.Umar-Kayyam.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

ఉమర్ ఖయ్యామ్

470

గగనము సగమై చుక్కలు
బెగడి మలీమసములైన విలయంబున నన్
మగువా ! యే తప్పునకై
తెగగార్చితి వనుచు నిలువఁదీసి యడుగనే.

471

ఏనాఁడై మమువీడి పోయితివొ యింతీ ! నీవు నిష్కారణం
బై, నింద్యం బగుకోపభారమున నాహా ! యొక్కనాఁడైన మా
దీనావస్థఁ దలచినావె ? కబురున్ దెప్పించుకొన్నావె ? య
య్యో ! నీలేమిని మేము పొంచు వ్యథలేవో వింటివే యెన్నఁడేన్ ?

472

కరచరణంబులు, నూహల
నెఱిఁగిన దశనుండి కాల మెంతయు నన్నున్
బొరిగొను ; సురయును, సుందరీ
దరిలేని దినాలు జీవితంబున వమ్ముల్.

473

బ్రతుకు విచారదుస్సహభరంబున వేడుకఁ గూర్చఁబోవ దో
యతివ త్వదీయఘోరవిరహాగ్ని మదాత్మను గాల్చె ; నా కిలన్
గుతుకము లేదు ; నిన్నుఁగని కూరిమి రంజిలుచుండెదన్ ; ద్వదా
కృతి గనరాని యీ బ్రతు క దేటికి ? లోక మదేటి కారయన్?