పుట:2015.393685.Umar-Kayyam.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

ఉమర్ ఖయ్యామ్

414

అదిగొ ప్రభాతకాల మడుగడ్గునకున్ సురఁ ద్రావికొంచుఁ బో
వుద మిఁక రండు ; కీర్తి యను ముంతను ఱాతినిబెట్టి కొట్టి సం
పద లను పెద్దకోర్కె లెడఁబాసియు, జాణ, విలంబకేశ సొం
పొదవు మృదంగగాయనిని బొందఁగఁ గోరుద మామె గైకొననన్.

415

స్వచ్ఛచషకగర్భంబులోఁ బ్రాణమున్న
దదిగొ ! యెఱని కాంతిమధ్వాసవంబు
పరిడవిల్లుట ; నిది నీటికరణి నున్న
నగ్నివలె మండి జాజ్వల్యమై తనర్చు.

416

నిన్నటిరేయి నా హృదయ నీరజమున్ వికసింపఁజేయఁగా
నన్నులమిన్న యోర్తు మధురాసవమున్ గొని పానశాలలో
గిన్నెడు తెచ్చి త్రావు మన ఖిన్నుఁడనై వలదంటిఁ ; గాని, యా
కన్నె "మదీప్సితార్థ మిదిగైకొను" మంచన దాని ద్రావితిన్.

417

మధువును ద్రావి మానినుల మధ్యమున న్విహరించువార లా
విధి విదు లాహితాగ్ను లగు విజ్ఞులకంటెఁ బదాఱువేల రె
ట్లధిగుణు ; లీ సురన్ గొను మహాత్ములె యా సురలోక మేగకే
వ్యధఁ బడుచో సురాలయము నారయనోపునె యొక్కఁ డేనియున్.