పుట:2015.393685.Umar-Kayyam.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

105

410

మృతిపాదంబులపైని బోరగిలి, జీవేచ్ఛా విహరాది సం
గతి నిర్మూలముగాఁగ బూదియగు నా కాయంబుతో భాండసం
తతియే కాని మఱొండు చేయకుఁడు ; తద్భాండంబులం దెవ్వఁడే
ని తమిన్ మద్యము దెచ్చి పోయునెడలన్ జీవింతు నే నయ్యెడన్.

411

సురగర్వాపహరంబు ; శీధువు దృఢాస్తోకోగ్రదుర్వార దు
ర్ధర దుర్గ్రంధుల విప్పు మంత్రమిది ; సైతానప్పుడే గ్రుక్కెఁ డీ
సుర నేఁ ద్రావిన నొక్కటేమి శతముల్ జోహారు "లాదమ్" లన
చ్చరణాబ్జంబుల కాచరింపఁడె సముత్సాహంబు శోభిల్లఁగన్.

412

లెమ్ము ! మృదంగ చారుమురళీనినదంబులఁ బాడుకొంచు మ
ద్యమ్మును ద్రావుచుంద ; మహహా ! యపకీర్తిఁ గీర్తికాంత నే
డమ్మి సురన్ సురాపణము నందునె కొందము ; గౌరవంపుభాం
డమ్ము నగౌరవం బను తటంబున బ్రద్దలు గొట్టివేయుమా !

413

చెలి రానన్నను నామె పైఁటచెఱఁగున్ జేపట్టి మధ్వాసవం
బుల సేవించుచు, శౌచశీలతపముల్ పోకార్చి కృష్ణాజినా
వళులన్ గ్రుక్కెడు నాసవంబునకునై బాజారులో నమ్మి యే
శిలపైనో యశ మన్న భాండమును విచ్ఛినంబు గావింపుమా !