పుట:2015.393685.Umar-Kayyam.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

107

418

ఎఱుఁగవు నీవు నేను మధు వేటికి మాననొ ; నాకు మద్యమున్
గరము నిషిద్ధ మెప్పుడును గాదు నిషిద్ధము బాహ్యభక్తిత
త్పరుల ; కనన్య భక్తులగువారికిఁ గా దటులైన నేనె యా
యురుతర పాపపుంజముల కుత్తరవాదిని గాకపోదునే.

419

కొనెదము మేము మద్యమును గ్రొత్తది ప్రాఁత దటంచు నెంచకే ;
గొనకొని స్వర్గసౌద మొక గోదుమగింజకు విక్రయింతు ; మో
వనిత ! గతాసుఁ డైన తరువాతను చెక్కడి కేఁగుదందువా ?
మును సురఁ దెచ్చి యిమ్మవలఁ బొమ్ము త్వదీప్సిత మున్న చోటికిన్.

420

ప్రేమ యను నెల్ల సభల దర్శించినాము
ఘన మహాలోకదుఃఖముల్ గడచినాము
ప్రేమయను సురఁద్రావి నిద్రించినాము
ఎల్లరకు స్వేచ్ఛ, యానందమెసఁగ నహహ !

421

ప్రాఁత సుమాసవంబు నవవైభవరాజ్యముకంటె శ్రేష్ఠ మీ
భూతలతిక్త కామ విషభోగము లావల నెట్టివేయు ; మా
శాత మధుప్రపూర్ణకలశంబు "ఫరీదును" లక్ష్మికంటె, నీ
మూఁత ప్రపూత "కైఖుసురు" మూర్థకిరీటముకంటె మించదే !