పుట:2015.393685.Umar-Kayyam.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

99

386

కాంత, నదీతటంబు, సుమకాండము, ద్రాక్షరసంబులందు నే
వెంతలభించునో కొనియథేచ్ఛ విలాసములందుఁ బుత్తు ని
శ్చింతగ నాఁడు నేడనక శీధువుద్రావుచునుంటి ముందు నీ
పొంతనె త్రావుదున్ బ్రతుకు ముందిఁక సాగినయంతకాలమున్.

387

నాహృదయంబులోఁగలదు నారులప్రేమ ; సుమాసవంబు నా
బాహులలోన నుండుత ; ప్రవక్తలు నన్నివి మానుమందు ; రా
యూహ పరాత్పరుం డిడకయుండిన నేనయి వీనిమాన నా
యూహ పరాత్పరుండునిడకుండుత మేయెడ నెన్నఁడేనియున్.

388

శీధువు చెంతనుండిన నిషేదము సేయకు ; మాహితాగ్ని కా
సాధులుచాల నీవెనుకఁ జాగిలమ్రొక్కఁగ వత్తు రీ ప్రపు
ల్లాధిక పుష్పసంచయ, మనంతఖగాళి కుహూకలస్వనో
పాధికమైన కాలమునఁ బాయఁగ న్యాయమె మద్య మీయెడన్.

389

మదిర యేచెలి నా కిడ మానెనేని
యింక కాలంబు నను గౌరవించు నొక్కొ ?
ప్రజలు మధుపానమును మానవలయు నండ్రు
నేను మాన నీశ్వరుఁడు మాన్పింపవలయు.