పుట:2015.393685.Umar-Kayyam.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ఉమర్ ఖయ్యామ్

390

ఎపు డరుంధతి, శశి మింట నెసఁగినారొ
యదిమొదలు నేరు సురకంటె నధికమైన
దేది గనలేదు ; సుర విక్రయించువార
లేమి వెలఁగొంద్రొ ? హెచ్చేదొ యింతకంటె ?

391

ఆవిధి లోకకర్త భువనాళి సృజించుచు శత్రుకోటికే
తావలమై సమున్నత హితంబునుగూర్చు సురాసవం బొగిన్
ద్రావెడు పాత్ర చేసిన మతస్థుఁడు గాఁడని తిట్టు లోక ; మా
హా ! విధి యేలచేయు సురకా సొరకాయ కమండలంబులన్.

392

నాయెడఁ బ్రేమ యున్న సుజనంబు వృథావచనాళిమాని నేఁ
బోయినవెన్క మద్యమును బోలెడు దుఃఖరసంబు నింపి, నా
కాయపు మట్టితోడ నిటుకల్ రచియించి పరిగ్రహించి మై
రేయ కుటీరకుడ్యముల రిప్పులఁగప్పుడు రాగమొప్పుగన్.

393

సగముపై సురపోసిన నాట్యమాడు ;
సురను దెగడెడువాఁడు భూసుఁరుడు గాఁడు ;
అట్టిసురమానుమనుచు నన్న నెద రేల ?
సురయె యుసురు శరీరభాసురతఁ గూర్చు.