పుట:2015.393685.Umar-Kayyam.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

ఉమర్ ఖయ్యామ్

382

చెలి ! మధుశాలలో మధువుచేతనె యాచమనంబు సేయఁగా
వలె ; నపకీర్తిపాలయినవానికిఁ గీర్తిలభించు టేయడన్
సులభము గాదు, గాన నిఁక శోకము మానుము ; మారహస్యమన్
వలువ చినింగిపోయె నిపుణంబుగఁ గుట్టఁగరాని కైవడిన్.

383

నేను జచ్చినఁ బూడ్ప యత్నింతురేని
పృథ్విపై వ్యర్థుఁడని పాఱవేతురేని
గోరిలో ఱాళ్లు తలక్రిందఁ గూర్తురేని
వానిశీధువుతోఁ గూర్చి వాడవలయు.

384

మథువును ద్రావినవారలు
మధురోక్తుల నాడఁగలరు మఱిమఱి చూడన్
బ్రథిత మహావాఙ్మయమునఁ
గథలల్లు టెదాని సమధికంబులు గలవే.

385

ఏను రుజాగ్రస్తుఁడ నీ
మేనన్ జ్వరమంతరించె మిక్కిలి సుర గై
కోనేని నిలువ వసువులు
పోనీ సురకంటె వేఱెపోలదు గొనినన్.