పుట:2015.393685.Umar-Kayyam.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

93

363

శీధువు జాతిచేతను, నిషిదమె యైనను నాకు నిష్ట ; మా
శీధువు కాంతయే యిడినఁ జెప్పెడి దున్నదె నాఁటివేడ్క ? యీ
శీధువు చేదు, నేహ్యము, నిషిద్ధమె కాని యదేమొ నాకదే
సాధువు, నిట్టివే హితము చాలదినంబులనుండి నాకొగిన్.

364

పాఠాంతరము :_
అలరువసంతకాలము, సురాసవమున్ లభియించుహాయనం
బులు నవలాప్రమత్త యదె ముందరనున్నవి ; వీనిగూడి యీ
కొలఁదిదినాలు మోదమునఁ గుల్కుము ; నిక్కపు జీవితాశయ
బులు నివె యాయువున్ జవము పొల్పెసలారును మద్యపాయికిన్.

365

త్రావుము మద్యమాయువు సతంబగు ; యౌవనకాంతిహెచ్చి యెం
తో విలసిల్లు ; నామనులతో నలరారు దినాలు ; మద్యమున్
గ్రేవ లభించు కాల, మల నీరజనేత్ర ప్రమత్త యున్న దిం
దే విహరింపు జీవిత మిదే సఫలం బగు సంతసంబునన్.

366

పానసభయందు నాబుద్ధి బహువిధాల
"రోమ, కారబు, యవన" ధర్మోపదేశ
ములు దెలుపునట్లు సురమాన వలయునన్నఁ
జదురె ? యీశ్వరుఁడే మెచ్చి వదరె మనకు.