పుట:2015.393685.Umar-Kayyam.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

ఉమర్ ఖయ్యామ్

367

ఇది యెలజవ్వనంబు ; సుర నేకడుఁ ద్రావెద ; దీనిచేతనే
కద లభియించు ధన్యత ! సఖా ! సుర నెప్పుడుఁ దిట్టబోకు, మే
యదనుననైన నీసుర మహాకటువైనను నాకు నిష్టమై
పొదలు నదేమనన్ బ్రతుకుఁ బోలిన దీసురగూడఁ గావునన్.

368

కర్మబాహ్యులుద్రావు కాదంబరిని రెండు
             లోకాలు పరిఢవిల్లును సతంబు
ప్రళయసూర్యుఁడు చిత్రవర్ణ సంకలిత సు
             రాపాత్ర పేరయి గ్రాలుచుండు
ఏరహస్యము ప్రాణిలో రూఢిగా దాగి
             యున్నదో యది చూడ నుంటివేని,
మధుకలశంబును మనసారగాఁ గాంచి
             తేని యా యర్థంబు తెలియగలదు
ఏరు బ్రతికెడు తెరువుఁ జూపింపకున్న
సురయుఁ, జషకంబె గురుపులై పరగు మాకు
సురయె మిత్రము దీనిభాసురకవోష్ణ
మమృతమున లేదు ; మానస మందు లేదు.

369

ఆ మధువే మతంబు హృదయంబుసుమీ ప్రియులారా ! నాకు నీ
వా మధు నిమ్ము నాకతిప్రియంబగు ప్రాణపదంబుసు మ్మిదే
యీ మనుజాళి త్రావి ప్రియమెట్టిదొ నేర్తురు ; నేఁబ్రియంబుగా
నీ మధుపాత్రఁ ద్రావెద, నిదేసుమి భేదము మాకు వారికిన్.