పుట:2015.393685.Umar-Kayyam.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

ఉమర్ ఖయ్యామ్

359

ఏ మృతిఁగాంతునేని మధువేకొని నా తుదితర్పణంబు నా
యీ మధుపాత్రచేత నొనరింపుఁడు ; చచ్చినవేళ నన్ను మీ
రేమయినాఁ డటం చరసిరేని, సురాలయద్వారబంధమం
దే మృదుమృత్తికన్ వెదకుఁ డెంతయు నేనట నుందు వేడుకన్.

360

కావ్యములను బూతంబు "పుర్ఖాను", దాని
నెల్లరుఁ బఠింతురెపుడు ; మా కల్లుసాల
నెల్లరుఁ బఠింతు రెపుడు ప్రపుల మతిని
బరవశానంద సంధానపాత్రలందు.

361

ఎపుడు మధుపాత్రఁ గైకొననెంతు నొక్కొ,
యపుడె యానందమున మైకమబ్బుచుండు
జవము సమకూడు ; నాత్మతేజము వహించు
కవిత ధారాప్రవాహంబుకరణిఁ దోఁచు.

362

మధుకలశంబు, గాయనియు మద్యనికేతము నున్నవిందు ; నా
పృథుహృదయంబు, నామతము వీనియధీనముఁ జేసివైచి యీ
మధువు స్మరించుచున్ సతముమస్తకమం గిడుకొందు ; నీ మహా
పృథివి సతంబె ? బుద్బుదమురీతిని బొల్చునుగాదె యారయన్.