పుట:2015.393685.Umar-Kayyam.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

ఉమర్ ఖయ్యామ్

337

వ్యర్థము, న శాశ్వతము ప్రాఁతవడ్డ జగము
కొఱకుఁజింతింప నేల ! యీవఱకుఁ గడచి
పోయినది పోయె ; ముం దేమిపుట్టునొక్కొ ?
వచ్చి సంతోషమునఁ బ్రొద్దుపుచ్చరాదె ?

338

ముందు రానున్న యిబ్బందులకై యిసు
             మంతయు మది భయమందవలదు
వచ్చియేయున్న యిబ్బందులు నిరతంబు
             స్థిర మని మదిలోన వెఱవవలదు
బ్రతికియున్నట్టి యీ ప్రతినిమేషంబును
             విలువైన దని మదిఁదెలియవలయుఁ
గడచిపోయిన కడగండ్లకై వెండియుఁ
             దలపోసి మదిని జింతిలఁగవలదు
వచ్చు కష్టాలకై మదివగవవలదు
ఇట్టు జగదవస్థలపాటు లెవ్వఁ డాప
దలకుఁ దల నిచ్చి, తెగి, కోపతాపములకుఁ
గ్రిందు మీదయి యగచాటు లందఁగలఁడు ?

339

లెమ్ము ! నిజానురాగభవలీలలఁ బుచ్చుము వర్తమానకా
లమ్ము ; విశాలవిశ్వము విలాస వికాస వినూత్న చారు స
స్యమ్ములఁ గుల్కుచున్నది ; నిజమ్ముగ నీ సమయమ్మునందు మ
ద్యమ్మును బాత్రలోనునిచి హాయిగఁద్రావుము నిర్విచారివై.