పుట:2015.393685.Umar-Kayyam.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

87

340

నరకము, స్వర్గ మెవ్వఁడు గనంజనె ? నచ్చటినుండి యెవ్వఁడీ
ధరణికి వచ్చె ? నీగతి వృథాపరికల్పితవస్తు పంక్తి ముం
దఱ మన కెంతొ భీతియునునమ్మకమున్నది ; వానిజాడ యీ
వఱకు నెఱుంగ రెవ్వరు నెపంబునఁ బెట్టిన పేళ్లు దక్కఁగన్.

341

కడచినదానికై, తిరిగి కాలవశంబున వచ్చుదానికై
తడయక, జీవితంబును వృథా వ్యసనంబులపాలు సేయ కో
గడియ మనంబు నిబ్బరముగానొనరింపఁగఁగల్గు కల్లు పో
సెడు చషకంబుతో హృదయసీమను రంజిలఁజేయు మెంతయున్.

342

ఆనందించెడు మానసంబునకు దుఃఖార్తిన్ వృథాసక్తి నేఁ
దేనేరన్ ; హితకాల మాపదలయందేదింప ; ముందేమి దాఁ
గానైయున్న దెవం డెఱుంగు ? నిపుడీకాంతారతం, బీసురా
పానంబున్ గొని యిష్టసిద్ధిఁ దగ సంపాదింతు నర్థార్థినై.

343

పోయినకాల మన్నఁదలపోయకు ; వచ్చెడి దున్న ముందె వా
పోయినవానిభంగిఁ దలపోయకు ; ధూతభవిష్యదంతరా
పాయములన్ బునాదినిడి భంగ పడన్ వల దున్న వేళనీ
ప్రాయము వ్యర్థపుచ్చకు నిరంతరమున్ ముద మందఁజూడుమా.