పుట:2015.393685.Umar-Kayyam.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

85

333

కలితవసంతవాసర ముఖంబుల మద్యముఁ దేరఁజెప్పుమా !
చెలి ! నరకంబు, స్వర్గమలసిద్దవధూటులజోలి వీడి ని
శ్చలముగఁ గూరుచుండుము ; నిజంబుగ నిన్నవి వచ్చి వేడ్కతోఁ
బిలుచు, వరించు వానికయి బెంగయొకింతయుఁ బొందఁబోకుమా.

334

దివి యుండున్, దివిజాంగనామణులు నందేయుందు, రత్యంతమా
సవముండున్, మధువుండు నందురుకదాస్వర్గాన ; మేమిందు నా
సవమున్, మంజులమానినీరతము, స్వేచ్ఛన్ జేయఁగవచ్చు ; న
య్యవియే స్వర్గములోపలన్ జరుగుఁగాదా మాట లింకేటికిన్ !

335

స్వర్గమున సుధాప్రవాహము, సుర స్వ ర్ధు
నీజలంబు తృప్తినెగడు నండ్రు
గాన మధువు నింపి కలశంబు నాచేత
నిడుమ రొక్క మరువు నుడువు లేల.

336

లోకభాగ్య మెల్ల లుప్తమైపోయినఁ
బ్రాణ ముండ నాసవంబు వీడ
సకియ ! నేను జగతిసంతోషినై యుందు
ముక్తి గలదొ లేదొ ముందు నాకు ?