పుట:2015.392383.Kavi-Kokila.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము ] సీతావనవాసము 37

మే వృంతచ్యుతియా?

లలనామణీ, నిరపరాధిని వగు నిన్నుఁగాన పాలుసేయనున్న ఈ కఠినాత్ముని మీ యిలువేల్పులైనఁ గోపింప రేల? పితృలోకవాసులగు నో రఘుకులేశ్వరులారా ! నన్నేల మీరు శపింపరు ? నిలింపులారా, మీ సమక్షమునఁ గదా సీత యగ్నిపరిశుద్ధయైనది, అట్టి మిమ్ములనైన గౌరవింపక కులకాంతను అడవులకు వెడలించు ఈ నిర్దయుని ఏల సహించుచున్నారు. ప్రకృతీఁ నీవేల తామసించితివి ?

                    నిర్భర ప్రళయాబ్ద గర్భసంభూతమై
                            కులిశోత్కరంబు నన్గూల్పదేమొ !
                    ఝంఝానిలోద్వేల సాగర కల్లోల
                            ములు పొంగిపొరలి నన్ముంప వేము!
                    పెటపెటార్భటితోడఁ బెటిలి యీ కుతలంబు
                            అతలంబునకు నన్ను నడపదేమొ!
                    క్షణకాలభగ్నమై స్తంభావలంబంబు
                            సౌధంబు గూలి నం జదుపదేమొ!

                    రాముఁడే లేకయున్న నీరాజవదన
                    యఖిల సౌఖ్యాభిరామయై యలరకున్నె?
                    శోక ఘూర్ణితమయ్యును సొక్కుఁగాని
                    యెంత కఠినంబొ పగుల దీ హృదయమకట!

సీత : [నిదురలో] ఆర్యపుత్రా, నన్ను మఱచితివా ?

రాము : సీత మేల్కనినదా? [చూచి] కాదు కాదు. కలవరించు