పుట:2015.392383.Kavi-Kokila.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36 కవికోకిల గ్రంథావళి [తృతీయాంకము

                      నకట! దారుణసత్యంబు; నవనిజాత
                      రామ హృదయంబుగాదింక, రమణి యెవతొ?

మదేకజీవితా, సీతా, గృహేందిరా, హృదయేశ్వరీ, అని మధురముగ సంబోధించు నా నాలుక నేఁటి కిట్టి కఠినాలాపము లాడవలసెఁగదా!

                     ఏకన్య పాణి నందీయ శతానందుఁ
                             డంగంబు పులకింప నందికొంటి;
                     ఏ ననబోణి నే నేగుదెంచఁగఁ దానె
                             ఘోరాటవులకుఁ న న్గూడివచ్చె;
                     ఏ సాధ్వి దను జాపహృతయయ్యు నేక వే
                            ణీవ్రతంబున సతీనియతి గడపె;
                     ఏ మోహనాంగిని నెడఁబాయ నాకు లో
                            కము శూన్యమగునట్టి విమలహృదయ;

                     అంభుజేక్షణ, రాకా శశాంక వదన,
                     యజన భూజాత, పూతవిఖ్యాత సీత
                     పాపకర్ముని కీర్తినాఁ బాసిపోవు;
                     రామభద్రున కింక దుర్భరము బ్రతుకు!

జానకీ, నాహృదయమును దొంగిలించుకొని పోవుదువా ? ఈ రామునకు హృదయ మొకటికలదా? కలిగిన బంగారుబొమ్మను. ఈ ముద్దుల మూటను వన్యమృగములకు బలియాయనెంచునా ? కాంతామణీ, ఈలోకమున నిన్నుఁ గాంచుటకిదియే కడసారియా? ఆశాకుసుమంబున కీ సందర్శన